విటమిన్లు (Vitamins)


విటమిన్లు (Vitamins)



మన ఆరోగ్యానికి విటమిన్‌లు చాలా అవసరం. పెద్దల నుంచి పిల్లల వరకు విటమిన్ల కొరతలేకుండా ఆరోగ్యంగా ఉంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని నిపుణులు అంటున్నారు. అలాగాకుండా విటమిన్ల కొరతతో వ్యాధులు రావడం తప్పదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అలాంటి విటమిన్లు మనకు లభించాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..

విటమిన్ "ఎ": విటమిన్ "ఎ" కొరతతో కంటి చూపు మందగిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. క్యాల్షియం మన శరీరానికి అత్యవసరం. ఇందుకోసం మునగాకు, ఆకుకూరలు, వెన్న, కోడిగుడ్డు పచ్చసొన, చేపలనూనె వంటివి తీసుకోవాలి.

విటమిన్ బి కోసం... మాంసం, కోడిగుడ్డు, కాయగూరులు తీసుకుంటూవుండాలి. లేకపోతే.. అజీర్ణం, రక్త హీనత వంటి సమస్యలు తలెత్తుతాయి.

విటమిన్ సి కోసం.. ఆరెంజ్ పండ్లు, ద్రాక్ష, కూరగాయలు, ఉసిరికాయ, నిమ్మ, టమోటా, జామపండు, బంగాళాదుంపలు, బొప్పాయి, తమలపాకు వంటివి తీసుకోవాలి. విటిమిన్ సి కొరతతో మానసిక వేదన, ఎముకల్లో బలహీనత, అలసట వంటివి తప్పవు.

విటమిన్ డి కోసం.. సూర్యకిరణాలు మన శరీరంపై పడితే డి విటమిన్ తానే తయారు చేసుకుంటుంది. కోడిగుడ్డు, చేపలు, వెన్న వంటి పదార్థాల్లో డి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. డి విటమిన్ కొరతతో ఎముకల్లో శక్తి తగ్గిపోతోంది. విటమిన్ ఇ.. కోసం గోధుమ, ఆకుకూరలు, తాజా కూరగాయలు తీసుకోవాలి.


Followers