నెపోలియన్‌ బొనపార్టి ఫ్రాన్సు

సామాన్య సైనికుడిగా ప్రారంభమైన నెపోలియన్‌ బొనపార్టి జీవితం ఫ్రాన్సు దేశానికి చక్రవర్తిగా, సకల ఐరోపా ఖండానికి తిరుగులేని నాయకుడుగా కలిగిన స్థానానికి ఎదగ గలిగింది. 1804 నుండి 1815 వరకు ఫ్రాన్సు దేశాన్ని పాలించిన నెపోలియన్‌ మొదట సైన్యంలో సాధారణ ఉద్యోగిగా చేరాడు. ఫ్రెంచి విప్లవం కొనసాగుతున్న ఆ రోజుల్లో చేవ గల సైనికాధికార్లకు అవకాశాలు మిన్నగా ఉండడంతో నెపోలియన్‌ చాకచక్యంగా అట్టి అవకాశాల్ని జారవిడువకుండా ఎదగగలిగాడు.
1796 ఏప్రిల్‌లో నెపోలియన్‌ ఇటలీపై దండయాత్రకు నిర్దేశించబడిన ఫ్రెంచి సైన్యానికి నాయకుడుగా నియమించబడ్డాడు. 27 ఏండ్లు కూడా నిండని నెపోలియన్‌కు ఇది ప్రతిష్టాకరమైన నియామకం. అతని జీవితంలో ఇది గొప్ప మలుపుగా పరిణమించింది. దాదాపు ఒక సంవత్సరం కొనసాగిన ఈ ఇటలీ దండయాత్ర తర్వాత నెపోలియన్‌ ఒక శక్తిగా రూపొందడం, అతి వేగంగా మహోన్నత శిఖరాలను చేరుకోవడం జరిగింది.
ఇటలీ దేశం ఆ రోజుల్లో అనేక స్వతంత్ర రాజ్యాల సమాహారం. ఒక్క సార్డీనియా తప్ప మిగిలిన రాజ్యాలన్నీ ఇతర ఐరోపా దేశాల అధీనంలో వ్ఞండేవి. అత్యధిక ప్రాంతం ఆస్ట్రియా పాలన క్రింద కొనసాగింది. అందు వల్ల నెపోలియన్‌ తన సేనలతో ఇటలీలో ఆస్ట్రియా సైన్యాలను ఎదుర్కొన వలసి వచ్చింది.
సైన్యాధ్యక్షుడుగా నెపోలియన్‌ అనేక సమస్యల నెదుర్కొనవలసి వచ్చింది. ఫ్రాన్సులో నెలకొన్ని అస్థవ్యస్థ పరిస్థితుల వల్ల సైనికులకు కలిగిం చిన సౌకర్యాలు చాలా తక్కువ. చాలీచాలని జీతాలు; చినిగిన యూనిఫారంలు, అర్ధ ఆకలితో కొనసాగే సైనికులతో నెపోలియన్‌ తన ఇటాలియన్‌ దండయాత్రను కొనసాగించవలసి వచ్చింది. కాని అన్ని అవరోధాలను అధిగమించి తన సైనికులకు ఉత్సాహాన్ని కలిగిస్తూ వారిలోని జాతీయ భావాన్ని పురిగొల్పుతూ అశేష ఆస్ట్రియా సైన్యాలను ఎదిరించి అనేక విజయాలు సాధించగలిగాడు నెపోలియన్‌.
మొదట పీడ్మాంటు రాజ్యంపై విజయం సాధించాడు నెపోలియన్‌. దీని తార్వత బైల్యూ అనే పేరు పొందిన సైన్యాధ్యక్షుని క్రింద గల ఆస్ట్రియా సైన్యాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇటలీలో క్రమంగా చొచ్చుకొస్తున్న ఫ్రెంచి సైన్యాలను అడ్డగించడానికి బూల్యూ అప్పటికప్పుడు కొత్త సైన్యాలను రప్పించి నెపోలియన్ను ఎదుర్కొన్నాడు. కాని 1796 మే నెల 6వ తేదినాటికి లంబార్డి రాజ్యాన్ని ప్రవేశించి మూడురోజుల తర్వాత 'అడ్డ అనే నది సవిూపానికి చేరుకొన్నాడు. నెపోలియన్‌ తన సేనలతో మెరుపుతీగలా జరిగిన ఈ చొరబాటుకు ఆస్ట్రియా సేనలు మే 10వ తేదీన నదిని దాటి తప్పించుకొన ప్రయత్నించాయి. చేరువ గల మిలన్‌ నగరానికి ఎట్టి రక్షణ లేకపోయింది.
'అడ్డ నదికి కుడివైపు తీరంలో వ్ఞంది 'లోడి అనే ఒక ప్రధాన పట్టణం. దానిచుట్టూ బలమైన కోట గోడలు వ్ఞండేవి. అప్పటికే ఆస్ట్రియా సేనలు వెళ్లినందున నెపోలియన్‌ సులభంగా లోడి పట్టణాన్ని ప్రవేశించాడు. దాదాపు 12 వేల మంది సైనికులు గల ఆస్ట్రియా సేనలు నదిపై గల వంతెనను దాటి అవతలివైపు మాటు వేశారు. మిలన్‌ పట్టణానికి గల దారి నెపోలియన్‌కు అధీనమైంది. కాని అడ్డ నదిపై గల లోడి బ్రిడ్జ్‌ కవతల సవిూకరించబడి వ్ఞన్న ఆస్ట్రియా సేనలను జయించిగాని మిలన్‌ నగరాన్ని చేరుకోలేడు.
లోడి వంతెన దాదాపు 200 అడుగుల పోడవ్ఞ కర్రలతో నిర్మించబడిన సన్నని వంతెన. దాదాపు 9 బెటాలియన్లతో ఆస్ట్రియా సైనికులు ఫ్రెంచి సేనలు బ్రిడ్జిని దాటనీయకుండా దిగ్భందన చేశారు. కాని నెపోలియన్‌ ఆస్ట్రియా సైన్యాలను శక్తివంతంగా ఎదుర్కొని పోరాడడానికి నిర్ణ యించుకొన్నాడు.
మే నెల 10వ తేది (1796) జరిగిన ఈ యుద్ధానికి ''లోడి బ్రిడ్జ్‌ యుద్ధం అని చరిత్రలో ప్రసిద్ధి పొందింది. సాయంకాలం 6 గంటలకు ప్రారంభమైన ఈ యుద్ధం సుమారు 5 గంటలు కొనసాగింది. గొప్ప వీరులుగా పేరుపొందిన సైవాయి సైనికులను మొదట శ్రేణుల్లో పంపాడు నెపోలియన్‌. కాని వారు వంతెనపై దాదాపు సగం దూరం రావడంతో ఆస్ట్రియా సేనలు వారిపై ఎగబడి తమ తుపాకుల వర్షంతో తిప్పిగొట్టారు. తర్వాత నెపోలియన్‌ మస్సీన, బార్తియర్‌ అనే ఇద్దరు యోధుల నాయకత్వం కింద మరికొంత సైన్యాన్ని పంపి రెండవ ప్రయత్నం కొనసాగించాడు. వీరు విజయవంతంగా ఆస్ట్రియా తుపాకులను ఛేదిస్తూ అవతలివైపుకు చేరగలిగారు. ఇంతలో మరికొన్ని కొత్త ఫ్రెంచి సైన్యాలు నెపోలియన్‌ను చేరాయి. దీనితో ఆస్ట్రియా సైన్యాలు వెనుదిరిగాయి.
ఈ లోడి బ్రిడ్జ్‌యుద్ధంలో ఆస్ట్రియా సేనలు విపరీత నష్టానికి గురైనాయి. దాదాపు 2 వేల మంది చనిపోయారు. అనేక తుపాకులు ఫ్రెంచివారి వశమయ్యాయి. మే నెల 14వ తేది నెపోలియన్‌ మిలన్‌ నగరాన్ని వీరోచితంగా ప్రవేశించాడు.
సైనికపరంగా లోడియుద్ధం అంత ప్రత్యేకత కలిగిందికాదు. కాని నెపోలియన్‌ జీవితంలో ఇది గొప్ప మలుపుగా పరిణమించింది. భవిష్యత్తులో అతని విజయపరంపరలకిది నాందిగా మారి, తనపై తనకు అమిత ఆత్మవిశ్వాసాన్ని సమకూర్చింది. దీని గురించి తన భార్య జోసఫిన్‌కు రాసిన జాబులో నెపోలియన్‌ ఇలా తెలియజేశాడు. ''నా వద్ద గల ఖడ్గంతో నేనెంతకైనా ఎదగగలను అని.
లోడి బ్రిడ్జ్‌ దాటడానికి సైనికులనుత్తేజపరుస్తూ అతడు చేసిన ప్రసంగాలు బాగా పనికి వచ్చిన కారణంగా తర్వాతి యుద్ధాలలో అట్టి పద్ధతిని అనుస రించేవారు నెపోలియన్‌.
తాను కేవలం 5 అడుగుల 2 అంగుళాల ఎత్తు మాత్రమే కలిగిన తన సైనికులందరి కన్నా పొట్టిగా వ్ఞన్నా, అతడు కనబరచిన ధైర్య సాహసాలకు అతని సైనికులు నెపోలియన్‌ను ''లిటిల్‌ కార్పొరల్‌ అని అన్నారట. అది తర్వాత కూడా తన ముద్దు పేరయింది.
భవిష్యత్తులో అనేక సైనిక విజయాలు సాధించాలనే అకుంఠిత దీక్ష; తన దేశంలో ఇతరులందరికంటే తానే గొప్పవాడనే ధీమా నెపోలియన్‌కు లోడి బ్రిడ్జ్‌ యుద్ధం మూలంగా కలిగింది.
''నెపోలియన్‌ అజేయుడు అన్న బలమైన భావాన్ని తాను నమ్మి, ఇతరులను నమ్మింపజేయడానికి కూడా ఈ యుద్ధం దోహద పడిందనవచ్చు

Followers