అమెరికా పాత్రిేకయుని చంపిన అల్‌ ఖైదా తీవ్రవాదులు



కాబూల్‌ : యెమెన్‌లోని అల్‌ ఖైదా తీవ్రవాదులు తమ చెరలో బందీలుగా ఉన్న అమెరికా పాత్రిేయుడు లూ్యక్‌ సోమర్‌సను, మరొక వ్యక్తిని హతమార్చారు. ఈ ఇద్దరిని వారి నుంచి కాపాడేందుకు అమెరికా ప్రత్యేక కార్యనిర్వహణ దళా లు శుక్రవారం రంగంలోకి దిగినప్పటికీ ఫలితం లేకపోయిందని అమెరికా రక్షణ శాఖ మంత్రి చుక్‌ హాెగల్‌ కాబూల్‌లో పేర్కొన్నారు. అయితే, బందీలను కాపాడేందుకు తాము చేసిన ప్రయత్నాలను ఆయన సమర్థించుకున్నారు. `అల్‌ ఖైదా తీవ్రవాదుల చేతిలో బందీగా ఉన్న సోమర్‌ ప్రాణాలకు తీవ్ర అపా యం ఏర్పడింది. దీనితో ఆయనను విడిపించేందుకు తాము రక్షణ చర్యలకు దిగవలసి వచ్చింది' అని హాెగల్‌ వివరించారు. యెమెన్‌ ప్రభుత్వ సహకారంతో తమ రక్షణ దళాలు తీవ్రవాదుల చెర నుంచి బందీలను విడిపించే కార్యక్రమా న్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ దాడిలో పలువురు అల్‌ ఖైదా తీవ్రవాదు లు కూడా మరణించినట్లు ఆయన తెలియజేశారు. ఈ ఘటనలో తీవ్రవాదు లు చంపివేసిన మరొకరు దక్షిణాఫ్రికా దేశానికి చెందిన వ్యక్తి అని తెలిసింది.


Followers