నిరోధకశక్తి కోసం..




lemon

వర్షాకాలం దాదాపు ముగిసిపోయింది. చలికాలం వచ్చేస్తున్నది! ఇలా ప్రతీసారి సీజన్ మారినప్పుడల్లా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వాతావరణం కాస్త చల్లబడిందంటే చాలు.. జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్‌లాంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఇంట్లో ఒకరికి వస్తే చాలు.. తేలికగా అందరికీ వ్యాప్తి చెందుతాయి. అలాంటి పరిస్థితుల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం. నిమ్మరసంలో విటమిన్-సి అధికంగా ఉంటుంది. ఇది కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడుతుంది. అల్లంలో యాంటీ ఇన్‌ప్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల ఇది మొత్తం శరీరం నొప్పుల్ని నివారించడానికి.. వికారాన్ని నయం చేయడానికి సహాయపడుతుంది.
వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో వెల్లుల్లి బాగా తోడ్పడుతుంది. ఎందుకంటే వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇక ఫ్రూట్ జ్యూస్‌లు వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి ఎంతగానో సహాయపడతాయి. బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్-ఎ పుష్కలంగా ఉన్న క్యారెట్‌ను జ్యూస్‌గానూ.. ఇతర ఆహారపదార్థాల్లో చేర్చుకోవడం మంచిది. నిద్రలేమి వ్యాధి నిరోధక శక్తిని తగ్గించేస్తుంది. సో.. కావాల్సినంత నిద్రతో శరీరం, మనసుకు విశ్రాంతి దొరికి.. త్వరగా కోలుకుంటారు


Followers