Showing posts with label New. Show all posts
Showing posts with label New. Show all posts

ఆశాజనకంగా ఆర్థిక సర్వే

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ 2014-15 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2015-16లో వృద్ధి రేటు 8 శా తంగా ఉంటుందని ఆర్థిక సర్వేలో అంచనా వేశారు. ద్రవ్య స్థిరీకరణకు ప్రభుత్వం కటు్టబడి ఉన్నటు్ల జైట్లీ తెలియజేశారు. సబ్సిడీల హేతుబద్ధీకరణకు పిలుపు ఇస్తున్న సర్వే ప్రస్తుతం ఇస్తున్న పలు రాయితీలు, నిరుపేదల జీవన ప్రమాణాలపై పరి మాణాత్మక మార్పును చూపినట్లు లేదని వ్యాఖ్యానించింది. మరింతగా ఆర్థిక వ్యవస్థ విస్తరణకు, దుబారా వ్యయం తగ్గిం పునకు, ఉత్పాదక పెట్టుబడి ప్రోత్సాహానికి సంస్కరణల అజెం డాను నిర్దేశించడం ఆవశ్యకమని కూడాసర్వే సూచించింది. కాగా, ఈ ఆర్థిక సర్వే ప్రకారం బడ్జెట్‌లో పలు కఠిన నిర్ణ యాలు తప్పవనే సంకేతాలను ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన సంస్కరణలకు, స్కిల్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియాకు బడ్జెట్‌లో ఊతమిచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండు సంవత్సరాల వ్యవధిలో ఆర్థిక వృద్ధి రేటు రెండు అంకెలకు చేరుకుంటుందని సర్వే అంచనా వేసింది. 2014-15 సంవత్సరా నికి ఆర్థిక వృద్ధి 7.4 శాతంగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. 2015-16లో 8 నుంచి 8.5 శాతం ఆర్థిక వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేసింది. ద్రవ్య లోటును, ద్రవ్యోల్బణాన్ని కూడా గణనీయంగా నియంత్రించడం సాధ్యమే అని సర్వే ధీమా వ్యక్తం చేసింది. వ్యయాల నియంత్రణ ద్వారా ద్రవ్య లోటును తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తున్నట్లు సర్వే తెలియజేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యోల్బణంగా గరిష్ఠం గా ఒక శాతం తగ్గి 5 నుంచి 5.5 శాతం దగ్గర నిలుస్తుందని సర్వే అంచనా వేసింది. ఇక ద్రవ్య లోటును 4.1 శాతానికి నియంత్రించడం సాధ్యమే అని సర్వే భావిస్తోంది. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం సబ్సిడీలను తగ్గించవలసి రావచ్చని ఆర్థిక సర్వే అంచనా. అయితే దానికి రాకీయ నిర్ణయం తీసుకో వలసి ఉంటుందని సర్వే గుర్తించింది. ద్రవ్య స్థిరీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సర్వే స్పష్టం చేసింది. చమురు ధర తగ్గుదల, స్పెక్ట్రమ్‌ వేలం ద్వారా గణనీయమైన ఆదాయం సమకూరుతుందని సర్వే అంచనా వేసింది. 2014-15లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 257 మిలియన్‌ టన్నులు ఉండవచ్చని సర్వే అంచనా వేసింది. గత ఐదు సంవత్సరాల కంటే ఇది 8.5 మిలియన్‌ ట న్నులు అధికమని ఆర్థిక సర్వే పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థ తీరుపై ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రహ్మణ్యన్‌ నేతృత్వంలోని బృందం రూపొం దించిన ఈ వార్షిక నివేదిక ఇక వృద్ధి రేటు మరింత పెరగాలని, రెండు అంకెల వృద్ధి రేటు సాధ్యమేనని పేర్కొన్నది. ఎగుమతులు, విదేశీ నిధుల సరఫరాతో కూడుకున్న విదేశీ వాణిజ్య రంగం కూడా తిరిగి పటిష్ఠం అవుతోందని సర్వే అభిప్రాయ పడింది. పారిశ్రామిక వృద్ధి రేటు కూడా ఇప్పుడు పెరుగుతోందని సర్వే తెలిపింది. వ్యవసాయ రంగంపై కూడా సర్వే కొన్ని మంచి అభిప్రా యాలనే వ్యక్తం చేసింది. `2014-15 సంవత్సరానికి ఆహార ధాన్యల ఉత్పత్తి 257.07 మిలియన్‌ టన్నులుగా అంచనా వేయడమైంది. ఇది గత సంవ త్సరాల స్థాయి కన్నా 8.5 మిలియన్‌ టన్నుల మేర అధికంగా ఉంటుంది' అని సర్వే తెలియజేసింది.
 ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు
 * 2014-15లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 257.07 మిలియన్‌ టన్నులు
 * రెండు అంెకల వృద్ధి రేటు సాధ్యమే
 * ఆదాయం పెంచేందుకు ప్రాధాన్యం
 * 2015-16లో కరెంట్‌ ఖాతా లోటు ఒక శాతం ఉంటుందని అంచనా
 * అర్హులకు ఫలాలు అందాలంటే జన్‌ ధన్‌, ఆధార్‌, మొబైల్‌ నంబర్‌ అవసరం
* వ్యవసాయ ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో సాధారణ మార్కెట్‌ కల్పించాలి

Followers